CBN: పాఠశాలల్లో తప్పనిసరిగా వాటర్ బెల్: సీఎం

విద్యార్థులు డీ హైడ్రేడ్ కు గురికాకుండా వాటర్ బెల్... మూడుసార్లు వాటర్ బెల్;

Update: 2025-03-25 04:30 GMT

వేసవి కాలం నేపథ్యంలో స్కూళ్లలో తప్పనిసరిగా వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. అధికారులను ఆదేశించారు. మంచి నీటిని నిత్యం అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఉపాధి హామీ కూలీలు ఉదయం 6 నుంచి 11 గంటల్లోపే పనులు ముగించుకునేలా చూడాలని ఆదేశించారు. మున్సిపల్ కార్మికులకు మ.12 నుంచి సా.4 గంటల మధ్య పనులు అప్పగించొద్దన్నారు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి రూ.39కోట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్నింగ్ 8.45 గంటలకు ఒకసారి.. 10.50 గంటలకి రెండోసారి.. 11.50 గంటలకు మూడోసారి బెల్ మోగించి.. ఐదు నిమిషాల చొప్పున స్టూడెంట్స్ మంచి నీళ్లు తాగేందుకు బ్రేక్ ఇవ్వనున్నారు. పాఠశాలలు ఏప్రిల్ నెలాఖరు వరకూ కొనసాగనున్న నేపథ్యంలో.. స్కూళ్లల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై రోజూ మొబైల్ అలర్ట్స్ ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు. వడదెబ్బ మరణాలు తగ్గించేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

ఈ నెల 27న పోలవరానికి సీఎం

సీఎం చంద్రబాబు ఈ నెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో పోలవరం చేరుకుంటారు. జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పనుల పురోగతి, కేంద్రం నుంచి నిధులను రాబట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటకు విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.

ఆందోళన వద్దు.. ఆదుకుంటాం

ఏపీలో అకాల వడగండ్ల వాన కారణంగా పంట నష్టపోయి అనంతపురం జిల్లాలో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై CM చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు. వర్షాలకు 4 జిల్లాల్లో హార్టి కల్చర్ పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. దీంతో ప్రభుత్వం నుంచి వారికి సాయం అందించాలని CM ఆదేశించారు. నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని, ఆదుకుంటామని CM భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News