AP Government : విదేశాలకు వెళ్లేవారికి అండగా ఏపీసర్కార్.. ప్రత్యేక పోర్టల్ రూపకల్పన

Update: 2025-07-16 12:45 GMT

విదేశాల్లో ఉపాధి అవకాశాలు అన్వేషిస్తున్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నైపుణ్యం పోర్టల్‌ను ఈ ఆగస్టు నాటికి పూర్తిచేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1న ఈ పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులతో ఉండవల్లిలోని నివాసంలో సమీక్ష నిర్వహించారు. పోర్టల్ రూపకల్పన, శిక్షణా మాడ్యూళ్లు, కౌన్సిలింగ్ అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ఈ పోర్టల్ ద్వారా యువతకు అవసరమైన శిక్షణతో పాటు విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు ఓంక్యాప్ ద్వారా కల్పించాలని లోకేశ్ అన్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్‌లైన్‌ నెంబర్ 0863-2340678, లేదా వాట్సాప్ నెంబర్ 85000 27678ను సంప్రదించాలని సూచించారు. ఇటీవల థాయ్‌లాండ్‌లో ఉద్యోగాల పేరుతో ఏజెన్సీల చేతిలో మోసపోయిన వారిని ఓంక్యాప్, ఎన్ఆర్‌టీ ద్వారా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్‌ స్పష్టం చేశారు.

Tags:    

Similar News