AP Government : మెప్మా రిసోర్స్ పర్సన్‌లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Update: 2025-07-04 10:30 GMT

పొదుపు సంఘాల్లో మహిళల అభివృద్ధి కోసం కృషిచేస్తున్న మెప్మా రిపోస్స్ పర్సన్లకు ప్రభుత్వం వరం ప్రకటించింది. ఆర్పీలు ఎవరైనా మూడేళ్ల వరకే పనిచేయాలనే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మూడేళ్ల కాలపరిమితి ఉత్తర్వులను రద్దు చేస్తూ పట్టణాభివృద్ధిశాఖ మెమో నెంబరు 2822995/యుబిఎస్/2025 తేదీ 02.07.2025ను విడుదల చేసింది. ఇప్పటి వరకూ పని భద్రత లేదన్న భయంతో గడిపిన ఆర్పిలు ఈ ఉత్తర్వులతో ఆనందోత్సాహాలకు గురయ్యారు. దీనిపై గురువారం సాయంత్రం పట్టణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణను విజయవాడ సిఆర్డి ఏ కార్యాలయంలో మెప్మా ఎమ్ డి శ్రీ తేజ్ భరత్ గారితో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయం తమ జీవితాల్లో వెలుగు నింపిందని.... జీవితాంతం సీఎం గారికి రుణపడి ఉంటామని తెలిపారు. ఇప్పటి వరకూ ఉద్యోగ భద్రతపై అనుమానంతో విధులు నిర్వహించామని...ఇక ముందు అటువంటిదేమీ లేకుండా ధైర్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. పట్టణాల్లో ఉన్న పొదుపు సంఘాల్లో మహిళల ఆర్థికాభివృద్ధిలో మెరుగైన పనితీరు, ఫలితాలు చూపిస్తామని ఆనందం వ్యక్తం చేశారు. 

గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసింది : మంత్రి నారాయణ

డ్వాక్రా,మెప్మా మహిళలను ఆర్ధికంగా పైకి తీసుకురావాలనేది సీఎం చంద్రబాబు గారి విధానం అన్నారు మంత్రి...10 వేల మంది రిసోర్స్ పర్సన్ లను ఇబ్బంది పెట్టేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో రద్దు చేయడం పట్ల సీఎం చంద్రబాబు కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేయడమే కాకుండా 10 లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టిందని ఆరోపించారు...ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.

Tags:    

Similar News