Andhra Pradesh: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్
Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరైంది. దేవినేని బెయిల్‌పై హైకోర్టులో నిన్న వాదనలు జరిగాయి.;
Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరైంది. దేవినేని బెయిల్‌పై హైకోర్టులో నిన్న వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. దేవినేనికి బెయిల్ ఇచ్చింది. జి.కొండూరులో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ఆరోపించిన దేవినేని.. మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని సందర్శించి వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అలజడి సృష్టించేందుకు కారణమయ్యారని, ఎస్సీ, ఎస్టీలపై దాడి చేశారని అభియోగాలు మోపుతూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. దేవినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే, జి.కొండూరు మైనింగ్‌లో అక్రమాలు బహిర్గతం చేసే సమయంలో.. దేవినేని ఉమపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని, ఉమ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రెండు వైపుల వాదనలు విన్న హైకోర్టు.. దేవినేనికి బెయిల్ మంజూరు చేసింది.