స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!
స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి మూడు రోజుల లోపు SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను ఆదేశించింది.;
స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి మూడు రోజుల లోపు SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను ఆదేశించింది. ఎక్కడ కలవాలనేది నిమ్మగడ్డ తెలియజేస్తారని తెలిపింది. స్థానిక ఎన్నికలు జరపలేమన్న ప్రభుత్వ వివరాలను అధికారులు తెలపాలని సూచించింది. ఒకవేళ ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య చర్చలు కొలిక్కి రాకపోతే తిరిగి వాదనలు వింటామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.