AP High Court: టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ..
AP High Court: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక ఆహ్వానితుల అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.;
AP High Court: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక ఆహ్వానితుల అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితుల నియమాకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం కొత్త చట్టం తెచ్చామని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది. జీవో విడుదల చేశారా అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు.
ప్రత్యేక ఆహ్వానితుల్లో 18 మంది నేరచరితులు ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఇదే విషయంలో 18 మంది ప్రత్యేక ఆహ్వానితులు కౌంటర్ దాఖలు చేయాలని గతంలో ఆదేశించింది హైకోర్టు. ఐతే ఇద్దరు మాత్రమే కౌంటర్ దాఖలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 11 లోపు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మార్చ్ 11కు వాయిదా వేసింది.