AP Movie Tickets: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకంపై ఏపీ హైకోర్టు స్టే..
AP Movie Tickets: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.;
AP Movie Tickets: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జోవో-69 నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో తదుపరి చర్యలు నిలిపివేయాలని పేర్కొంది. విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు వీలుగా గతేడాది డిసెంబర్ 15న చట్ట సవరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
టికెట్ల విక్రయ బాధ్యతను టికెట్ల విక్రయ బాధ్యతలు AP SF TV TDCకి అప్పగించింది. ఐతే.. వైసీపీ సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బుక్‌మైషో, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు కోర్టుకు వెళ్లాయి. ఈ రెండు సంస్థలతోపాటు విజయవాడ డిస్ట్రిబ్యూటర్లు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఇదివరకే వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలపై చీఫ్ జస్టిస్ బెంచ్ స్టే ఇచ్చింది.
పారదర్శకత కోసమే ప్రభుత్వం ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయానికి నిర్ణయం తీసుకుందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రొడ్యూసర్లు అంతా ఆమోదం తెలిపాకే తాము దీనిపై ముందుకు వెళ్లామంటున్నారు. ఐతే.. టికెట్లు అమ్మిన తర్వాత ఎగ్జిబిటర్లకు ఆ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారు అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి.
MOU చేసుకోవాలని, లేదంటే ధియేటర్లకు అనుమతులు ఉండవని తమను హెచ్చరించడం తప్పిస్తే.. డబ్బులు ఎలా ఇస్తారనేది చెప్పకపోతే ఎలాగని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అటు, ఇప్పటికే కొన్ని యాజమాన్యాలు బుక్‌మై షో లాంటి వాటితో కుదుర్చుకున్న కాంట్రాక్టు ఇంకా ముగియలేదని చెప్తున్న నేపథ్యంలో.. ఆన్‌లైన్ విక్రయాలపై గందరగోళం నెలకొంది. వీటిపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. ప్రస్తుతానికి ఆన్‌లైన్ విక్రయాలపై స్టే ఇచ్చింది.