ఏపీలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు
పంచాయతీ ఎన్నికలపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు.;
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు వెలువరించింది. ప్రభుత్వం నుంచి ముగ్గురు సీనియర్ అధికారులను ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ వద్దకు పంపించాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది.. పంచాయతీ ఎన్నికలపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కరోనాపై ఎస్‌ఈసీకి తాజా పరిస్థితులను వివరించాలని ప్రభుత్వానికి సూచించింది. సీనియర్ అధికారులతో సంప్రదింపుల తర్వాత ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది.