జగన్‌ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించిన హైకోర్టు

Update: 2020-10-02 01:14 GMT

జగన్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి హెచ్చరించింది. రూల్‌ ఆఫ్ లా సరిగ్గా అమలు కాకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తామని స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదా?.. అయితే పార్లమెంట్‌కు వెళ్లి ఏపీ హైకోర్టును మూసేయమని అడగండంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది హైకోర్టు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడాన్ని సహించబోమని విస్పష్టంగా పేర్కొంది.

హైకోర్టుపైనే వివాదాస్పద వ్యాఖ్యలా? అని న్యాయస్థానం ప్రశ్నించింది..దీని వెనుక కుట్ర ఉందేమో తేలుస్తామని పేర్కొంది. జడ్జిలపై ఆరోపణలతో హైకోర్టే పిటిషన్‌ వేసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించింది. ఇలాంటి స్థితి ఎన్నడూ లేదని పేర్కొంది. జ్యుడీషియరీ స్తంభం బలహీనమైతే సివిల్‌ వార్‌కు అవకాశం అవకాశం ఉందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Similar News