AP High Court: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం..
AP High Court: న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను వెంటనే తొలగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.;
AP High Court: న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను వెంటనే తొలగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో జరిగిన దూషణలపై సీబీఐ చేస్తున్న దర్యాప్తుపై హైకోర్టులో విచారణ జరిగింది. తాము లేఖలు రాసినా.. ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ పట్టించుకోలేదని.. సీబీఐ.. హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ లేఖ రాస్తే హైకోర్టు ఉత్తర్వులుగానే పరిగణించాలని ఆదేశించింది. సీబీఐ, హైకోర్టు రిజిస్ట్రార్ లేఖలకు ఎందుకు స్పందించలేదని.. సోషల్ మీడియా ఫ్లాట్‌పామ్‌లను హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ఈనెల 31కి వాయిదా పడింది.