ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం..!
తనకు రావాల్సిన పెన్షన్ నిలిపివేశారంటూ రాము అనే వికలాంగుడు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది;
ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.. తనకు రావాల్సిన పెన్షన్ నిలిపివేశారంటూ రాము అనే వికలాంగుడు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. వికలాంగుడి పెన్షన్ ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించింది.. అయితే, పెన్షన్ నిలిపివేసే నాటికి అతనికి రేషన్ కార్డు లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు తెలిపింది.. పెన్షన్ కొనసాగించాలని, నిలిపివేసిన బకాయిలను కూడా చెల్లించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.