వైఎస్సార్ వాహనమిత్ర స్కీమ్‌పై ఏపీ హైకోర్టు స్టే..!
వైఎస్సార్ వాహన మిత్ర పథకంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాశ్ పిటిషన్ వేశారు.;
వైఎస్సార్ వాహన మిత్ర పథకంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాశ్ పిటిషన్ వేశారు. రాజకీయ లబ్ది కోసం... దేవాదాయ శాఖ నిధులను వైఎస్సార్ వాహనమిత్ర స్కీమ్‌కు వాడుతున్నారని పిటిషన్‌లో తెలిపారు. చట్ట విరుద్ధంగా దేవాదాయ శాఖ నుంచి 49 లక్షలను ప్రభుత్వం కేటాయించిందని పిల్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ ఎన్. జయసూర్య నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం... వాహనమిత్ర కోసం విడుదల చేసిన నిధులను వాడకూడదని స్టే విధించింది. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 5 నాటికి వాయిదా వేసింది.