AP: ఏపీలో హిందూజా రూ.20,000 కోట్ల పెట్టుబడి
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , హిందూజా గ్రూప్ మధ్య రూ.20,000 కోట్ల పెట్టుబడి ఎంఓయూ జరిగింది. ఈ ఒప్పందం రాష్ట్ర ఇండస్ట్రియల్ , క్లీన్ ఎనర్జీ రంగాల్లో ఉపాధి అవకాశాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్కు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హిందూజా గ్రూప్ చైర్మన్ ఆశోక్ పి. హిందూజా, యూరప్ చైర్మన్ ప్రకాష్ హిందూజా, సీఈఓ వివేక్ నందా.. ఎంఓయూ చేసుకున్నారు. ఈ ఎంఓయూ ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్హ బ్గా మార్చే లక్ష్యంతో రూపొందింది. హిందూజా గ్రూప్, ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, ఎనర్జీ రంగాల్లో ఉన్న భారతీయ మల్టీ-నేషనల్ కార్పొరేట్ కంపెనీ. ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి, ట్రాన్స్పోర్ట్ సెక్టర్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు.
మరో 1,600 మెగావాట్ల వరకు...
విశాఖలోని హిందూజా సంస్థకు ప్రస్తుతమున్న 1,050 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను అదనంగా మరో 1,600 మెగావాట్ల వరకు సామర్థ్యాన్ని పెంచనుంది. ఇక్కడ ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు కొత్త యూనిట్లను స్థాపిస్తుంది. రాయలసీమలో భారీ సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులు ఏర్పా టు చేస్తుంది. ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాల తయారీ లక్ష్యంగా కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నెలకొల్పనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్ తీసుకురానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపైన హిందూ జా ప్రతినిధులు సంతకాలు చేశారు.
రోల్స్ రాయిస్‌కు ఆహ్వానం
ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్, డీజిల్ ప్రొపెల్షన్ సిస్టమ్స్ తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న రోల్స్ రాయిస్ గ్రూప్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సంస్థ సీటీవో నిక్కి గ్రేడి స్మిత్‌తో జరిగిన భేటీలో.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఓర్వకల్లులో మిలటరీ ఎయిర్ స్ట్రిప్, విమానాల మెయింటెనెన్స్, రిపెయిర్, ఓవర్ హాలింగ్(ఎంఆర్‌ఓ) యూనిట్ ఏర్పాటుకు అవకాశాలున్నాయని తెలిపారు.