AP Inter Results : రేపు ఏపీ ఇంటర్ రిజల్ట్స్.. లింక్ ఇదే!

Update: 2025-04-11 09:45 GMT

ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో పొందవచ్చు. అలాగే సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం 9552300009 అనే నెంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే, మన మిత్ర సేవ ద్వారా తక్షణమే ఫలితాలను పొందవచ్చు.

ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఇలా:

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ (https://resultsbie.ap.gov.in. )లోకి వెళ్లాలి.

ఇక్కడ ఇంటర్ ఫలితాలు - 2025 లింక్ పై క్లిక్ చేయాలి.

ఇక్కడ విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ తో పాటు ముఖ్య వివరాలను నమోదు చేయాలి.

సబ్మిట్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు

Tags:    

Similar News