AP Liquor : ఏపీ లిక్కర్ కేసు: జగన్ సన్నిహితుడి కంపెనీల్లో సిట్ సోదాలు

Update: 2025-09-11 13:11 GMT

ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్‌రెడ్డికి చెందిన కంపెనీలపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా హైదరాబాద్, విశాఖపట్నంలోని పది కంపెనీలలో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని స్నేహహౌస్, రోడ్ నెంబర్ 2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్-రాజేంద్రనగర్, ఖైరతాబాద్‌లోని కమలాపురి కాలనీ ఫేజ్-1 కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే విశాఖలోని వాల్తేర్ రోడ్, వెస్ట్ వింగ్‌లో ఉన్న కార్యాలయంలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఎనిమిది కంపెనీల కోసం సునీల్‌రెడ్డి నాలుగు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. విశాఖపట్నంలోని రెండు కంపెనీల కోసం ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సోదాల్లో అక్రమాలపై కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News