AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు చర్యలు.. తీవ్రంగా కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ఉద్యోగాల భర్తీకి నారా లోకేశ్ ప్రత్యేక చర్యలు.. ప్రైవేట్ కంపెనీలతోనూ విస్తృత చర్చలు

Update: 2025-09-01 04:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రం­లో కూ­ట­మి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిన నాటి నుం­డి ఏపీ­ని అన్ని వి­ధా­లు­గా ప్ర­గ­తి పథం­లో ముం­దు­కు నడి­పిం­చ­డా­ని­కి ప్ర­య­త్నం చే­స్తుం­ది. ఈ క్ర­మం­లో­నే ని­రు­ద్యో­గుల వి­ష­యం­లో కూడా ఉద్యో­గా­లు, ఉపా­ధి కల్పన పైన పె­ద్ద ఎత్తున ఫో­క­స్ చే­స్తుం­ది. గతం­లో టి­డి­పి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో ఉన్న­ప్పు­డు 2014లో స్వ­ల్ప సం­ఖ్య­లో ఖా­ళీ­ల­ను భర్తీ చే­సిం­ది. ఆ తర్వాత వై­సి­పి హయాం­లో ఖా­ళీ­లు భర్తీ చే­స్తా­ర­ని భా­విం­చిన ఐదే­ళ్ల­పా­టు అది జర­గ­లే­దు. గత ఐదే­ళ్ల­లో పలు­వు­రి­కి పదో­న్న­తు­లు రా­వ­డం, పలు­వు­రు రి­టై­ర్ కా­వ­డం తో చాలా పో­స్టు­లు ఖాళీ అయ్యా­యి. వి­విధ క్యా­డ­ర్ లలో 40 శాతం పో­స్టు­లు ఖా­ళీ­గా ఉన్నా­యి. ఇక ఈ సమ­స్య­ను ఉద్యోగ సం­ఘా­లు యా­జ­మా­న్యం దృ­ష్టి­కి తీ­సు­కు­వె­ళ్ల­గా, కూ­ట­మి సర్కా­ర్ ఈ ఖా­ళీ­ల­ను భర్తీ చే­య­డా­ని­కి గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ది. అయి­తే పో­స్టు­లు భర్తీ చే­య­క­పో­వ­డం­తో ఇప్ప­టి­వ­ర­కు పదో­న్న­తు­లు వచ్చిన వారు పదో­న్న­తి తో పాటు , తాము గతం­లో ని­ర్వ­హిం­చిన బా­ధ్య­త­ను కూడా అద­నం­గా ని­ర్వ­హిం­చా­ల్సి వస్తుం­ది. రెం­డు పో­స్టుల వి­ధు­ల­తో వా­రి­పైన పని ఒత్తి­డి పె­రి­గిం­ది.

ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు

రా­జ­ధా­ని అమ­రా­వ­తి­లో ఏర్పా­టు­చే­సే క్వాం­ట­మ్‌ కం­ప్యూ­టిం­గ్‌ వ్యా­లీ దక్షి­ణా­సి­యా­లో­నే మొ­ద­టి­ద­ని ఐటీ, వి­ద్య, ఆర్టీ­జీ­ఎ­స్‌ శాఖల మం­త్రి లో­కే­శ్‌ వె­ల్ల­డిం­చా­రు. ఇం­దు­లో ఐదే­ళ్ల­లో లక్ష మం­ది­కి ఉద్యో­గా­లు లభి­స్తా­య­ని తె­లి­పా­రు. 50కి పైగా యూ­ని­కా­ర్న్‌­లు అభి­వృ­ద్ధి చే­స్తా­మ­న్నా­రు. ఈ వ్యా­లీ చం­ద్ర­బా­బు సాం­కే­తిక వి­ప్ల­వం­లో సె­కం­డ్‌ చా­ప్ట­ర్‌­గా పే­ర్కొ­న్నా­రు. సో­మ­వా­రం వి­జ­య­వా­డ­లో క్వాం­ట­మ్‌ వ్యా­లీ వర్క్‌­షా్‌­ప­లో ఆయన మా­ట్లా­డా­రు. వచ్చే జన­వ­రి 1న ప్రా­రం­భిం­చే ఈ క్వాం­ట­మ్‌ వ్యా­లీ­కి అను­బం­ధం­గా.. ఆలో­చ­న­ల­ను ఆవి­ష్క­ర­ణ­లు­గా.. ఆవి­ష్క­ర­ణ­ల­ను పరి­శ్ర­మ­లు­గా మా­ర్చే ఎకో సి­స్ట­మ్‌­ను అభి­వృ­ద్ధి చే­స్తా­మ­ని చె­ప్పా­రు. ఇది ఒక­రో­జు కా­ర్య­క్ర­మం కా­ద­ని.. ని­రం­తర కొ­న­సా­గు­తుం­ద­ని.. దీ­ని­కి అమ­రా­వ­తి కేం­ద్ర బిం­దు­వు­గా ఉం­టుం­ద­ని అన్నా­రు. క్యూ­బి­క్‌ ఆర్కి­టె­క్చ­ర్‌ నుం­చి క్ర­యో­ఎ­ల­కా్ట్ర­ని­క్స్‌ వరకూ.. అల్గా­రి­థం అభి­వృ­ద్ధి నుం­చి క్వాం­ట­మ్‌ సా­మ­ర్థ్యా­న్ని అభి­వ్దృ­ద్ధి చే­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. దే­శం­లో అత్యంత అభి­వృ­ద్ధి చెం­దిన ఐబీ­ఎం క్వాం­ట­మ్‌ సి­స్ట­మ్‌-2 త్వ­ర­లో­నే అమ­రా­వ­తి­లో అం­దు­బా­టు­లో­కి వస్తుం­ద­ని, ఇది చాలా గర్విం­చ­ద­గ్గ వి­ష­య­మ­ని చె­ప్పా­రు. 

కూటమి సర్కార్ కీలక చర్యలు

\రా­ష్ట్ర వి­భ­జన జరి­గి పదే­ళ్లు దాటి పో­తు­న్నా ని­రు­ద్యోగ సమ­స్య అను­కు­న్న మేర తగ్గ­డం లేదు. 2014-19లో కొంత మేర సమ­స్య­ను పరి­ష్క­రిం­చి­న­ప్ప­టి­కీ.. 2019-2024 వరకు ఈ సమ­స్య మరింత పె­రి­గిం­ది. ఉద్యో­గా­లు లేక యు­వ­తీ, యు­వ­కు­లు తీ­వ్ర ఇబ్బం­దు­లు పడు­తు­న్నా­రు. ఏదో ఒక పని చే­సు­కు­నేం­దు­కు ఇతర దే­శా­లు, రా­ష్ట్రా­ల­కు వె­ళ్లి­పో­తు­న్నా­రు. చదు­వు­కు తగ్గ ఉద్యో­గం దొ­ర­క­క­పో­యి­నా ఏదో ఒక పని చే­సు­కుం­టూ కష్టా­లు­ప­డు­తూ అక్క­డే పో­తు­న్నా­రు. ఇలాం­టి పరి­స్థి­తు­లు లే­కుం­డా ని­రు­ద్యోగ సమ­స్య­ను చక్క­ది­గ్గేం­దు­కు కూ­ట­మి ప్ర­భు­త్వం తీ­వ్రం­గా కృషి చే­స్తోం­ది. మం­త్రి నారా లో­కే­శ్ చొ­ర­వ­తో ప్రై­వే­టు కం­పె­నీ­ల్లో ఉద్యో­గాల కోసం రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా జాబ్ మే­ళా­ను ని­ర్వ­హి­స్తు­న్నా­రు. ప్ర­భు­త్వం నుం­చి మెగా డీ­ఎ­స్సీ­ని ని­ర్వ­హిం­చా­రు. అలా­గే కా­ని­స్టే­బు­ల్ జా­బు­ల­ను భర్తీ చే­శా­రు. అం­తే­కా­కుం­డా పా­ల­న­లో ఎప్ప­టి­క­ప్పు­డు ప్ర­త్యే­క­త­ను చాటు చా­టు­కుం­టు­న్నా­రు. రే­ష­నిం­గ్ వి­ధా­నం­లో కొ­త్త మా­ర్పు­లు చే­శా­రు. పే­ద­ల­కు రే­ష­న్ బి­య్యం అం­దిం­చేం­దు­కు స్మా­ర్డ్ కా­ర్డు­ల­ను అం­దు­బా­టు­లో­కి తీ­సు­కొ­చ్చా­రు. వి­జి­టిం­గ్ కా­ర్డు మా­ది­రి­గా కు­టుంబ సభ్యుల వి­వ­రా­ల­తో కూ­డిన కా­ర్డు­ను అం­ద­జే­స్తు­న్నా­రు. ఇం­దు­లో భా­గం­గా గుం­టూ­రు­లో ని­ర్వ­హిం­చిన స్మా­ర్ట్ కా­ర్డుల పం­పి­ణీ­లో మం­త్రి నా­దెం­డ్ల మనో­హ­ర్తో కలి­సి కేం­ద్ర­మం­త్రి పె­మ్మ­సా­ని చం­ద్ర­శే­ఖ­ర్పా­ల్గొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా పె­మ్మ­సా­ని ఉద్యో­గా­ల­పై కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. సీఎం చం­ద్ర­బా­బు, మం­త్రి లో­కే­శ్ చొ­ర­వ­తో త్వ­ర­లో భా­రీ­గా ఉద్యో­గా­లు వస్తా­మ­ని తె­లి­పా­రు. గత ప్ర­భు­త్వం హయాం­లో ఒక్క కం­పె­నీ కూడా రా­ష్ట్రా­ని­కి రా­లే­ద­ని గు­ర్తు­చే­శా­రు. రా­ష్ట్రా­ని­కి పె­ట్టు­బ­డు­ల­పై కూ­ట­మి ప్ర­భు­త్వం దృ­ష్టి పె­ట్టిం­ద­ని, కం­పె­నీ­ల­ను ఆహ్వా­నిం­చిం­ద­ని కేం­ద్ర­మం­త్రి పె­మ్మ­సా­ని తె­లి­పా­రు.

టీ­సీ­ఎ­స్, కా­గ్ని­జెం­ట్ సం­స్థ­ల­కు వి­శా­ఖ­లో ఇప్ప­టి­కే భూ­కే­టా­యిం­పు­లు పూ­ర్తి చే­శా­మ­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు. ఆ సం­స్థ­లు సా­ధ్య­మై­నంత త్వ­ర­గా కా­ర్య­క­లా­పా­లు ప్రా­రం­భిం­చే­లా చర్య­లు తీ­సు­కో­వా­ల­ని మం­త్రి సూ­చిం­చా­రు. ఇటీ­వల తమ బెం­గు­ళూ­రు పర్య­ట­న­లో గ్లో­బ­ల్ కే­ప­బి­లి­టీ సెం­ట­ర్ల ఏర్పా­టు­కు ఏఎ­న్ఎ­స్ఆ­ర్, సత్వ సం­స్థ­లు ఎం­ఓ­యూ­లు కు­దు­ర్చు­కు­న్నా­య­ని, ఈ రెం­డిం­టి ద్వా­రా­నే యు­వ­త­కు 35 వేల ఉద్యో­గా­లు రా­ను­న్నా­య­ని చె­ప్పా­రు. రా­ష్ట్రా­ని­కి వచ్చే చి­న్న సం­స్థల కోసం 26 జి­ల్లా కేం­ద్రా­ల్లో కో వర్కిం­గ్ స్పే­స్​­లు సి­ద్ధం చే­యా­ల­ని సూ­చిం­చా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం చర్య­ల­తో ఉపా­ధి అవ­కా­శా­లు పె­రు­గు­తు­న్నా­యి.

Tags:    

Similar News