AP Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం.. వారే నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు..
AP Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం కొనసాగుతునే ఉంది.;
AP Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం కొనసాగుతునే ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు. టికెట్ ధరలపై జేసీ నిర్ణయం తీసుకుంటారంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే.. ఇవేవి పట్టించుకోని థియేటర్ యజమానులు.. ఎప్పటిలాగే రేట్లు డబుల్ చేసి అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు.. థియేటర్లలో సోదాలు చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పుష్ప సినిమా టికెట్ రేట్లు వివాదంగా మారింది. థియేటర్ నిర్వాహకులు.. టికేట్ రేట్లను డబుల్ చేసి అమ్ముతున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆర్డీవో రచన.. ఏలూరులోని అంబికా, సాయిబాలాజీ థియేటర్లో సోదాలు చేశారు. ప్రేక్షకులకు డబ్బులు తిరిగి ఇప్పించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని థియేటర్ల నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు.
కోర్టు ఉత్తర్వులు చూపి JC అనుమతి లేకుండానే ధియేటర్ల యాజమానులు.. టికేట్ ధరలు పెంచేసి విక్రయిస్తు న్నారంటున్నారు ప్రేక్షకులు. ఒక్కొ టికెట్ 250 కి పైగా అమ్ముతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు
రానున్న రోజుల్లో వరుసగా భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో సినిమా టికెట్ల లొల్లి తెరమీదకి రావడం మరోసారి చర్చనీయాంశమైంది. అటు నిర్మాతలు సైతం.. జగన్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సిని ఇండస్ట్రీకి చేయూతను అందిచాల్సింది పోయి.. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు.