AP: ఏపీకి కొత్త సంవత్సర కానుక
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం... జనవర 4న తొలి విమానం ల్యాండింగ్... ఢిల్లీ నుంచి రానున్న ప్రత్యేక విమానం...
ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావడంతో, అధికారులు కీలకమైన ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జనవరి 4న భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి కమర్షియల్ ఫ్లైట్ దిగనుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జనవరి 4, 2026న తొలి విమానం ఎగరనుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, ఎంపీ అప్పలనాయుడు ఢిల్లీ నుంచి ఈ తొలి విమానంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి, అంతర్జాతీయ విమాన సేవలకు కీలక కేంద్రంగా మారనుంది. మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. ప్రస్తుతం 95 శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం 5 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి, ఆగస్టు నెలలో విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
.భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రన్‌వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయ్యేందుకు అధికారులు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది భోగాపురం విమానాశ్రయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ విమానాశ్రయం భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి రావడం, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు మరికొద్ది నెలల్లో పూర్తికానున్నాయి. 2026 మే నెల నుంచే విమాన రాకపోకలు సాగించేలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి.