Sajjala Bhargavreddy: సజ్జల భార్గవ్‌రెడ్డిపై లుకౌట్‌ నోటీసులు

విదేశాలకు పారిపోతాడని నోటీసులు జారీ.. ప్రత్యేక బృందాలతో గాలింపు;

Update: 2024-11-13 02:30 GMT

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై కడప పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏపీలో భార్గవ్‌ రెడ్డిపై ఇప్పటికే పలు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. వైసీపీ సోషల్ మీడియా యాక్టవిస్టు వర్రా రవీందర్‌రెడ్డి పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. సజ్జల భార్గవ్‌రెడ్డి వైసీపీ సోషల్‌ మీడియా బాధ్యతలు తీసుకున్నాక మరింత రెచ్చిపోయామని.. తెలిపాడు. జడ్జీలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని అతడే బెదిరించాడన్నాడు. 2023 నుంచి తన ఫేస్‌బుక్‌ ఐడీతో పోస్టులు పెట్టేవారని... వైసీపీ సోషల్‌ మీడియాలో భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, సుమారెడ్డి కీలకమని వర్రా పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు సజ్జలను అదుపులోకి తీసుకునేందుకు సమాయత్తమయ్యారు.

ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కేసు

సోషల్ సైకోలు రెచ్చిపోవడం వెనుక సజ్జల భార్గవ్‌రెడ్డి ఉన్నాడన్నది పోలీసుల అనుమానం. దీనిపై కూపీ లాగుతున్నారు. లేటెస్ట్‌గా కడప జిల్లా పులివెందులలో సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఎస్టీ-ఎస్సీ కేసు నమోదు అయ్యింది. సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కులం పేరుతో దూషించారంటూ బాధితుడు అందులో ప్రస్తావించాడు. వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్ రెడ్డిల పేర్లను ప్రస్తావించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఆ ముగ్గురిపై పులివెందుల పోలీసుస్టేషన్‌లో ఎస్టీ-ఎస్సీ కేసు నమోదు అయ్యింది. నాన్ బెయలబుల్ సెక్షన్ల కిందట కేసు రిజిస్టర్ చేశారు. దీంతో వీరిని ఎప్పుడైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. మరోవైపు భార్గవ్‌రెడ్డి వ్యవహారంపై ఫ్యాన్ పార్టీలో చిన్నపాటి చర్చ మొదలైపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్గర్ కామెంట్స్, పోస్టుల పెట్టడం వల్లే ప్రజలు తమను దూరంగా పెట్టారన్న గుసగుసలు ఆ పార్టీ వినిపిస్తున్నాయి. ముఖ్యనేతలు ఈ విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకునే బెటరని అంటున్నారు. వీటి వల్ల పార్టీకి ఊహించని డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News