AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాలు

మూడు కొత్త జిల్లాలకు సర్కార్ ఆమోదముద్ర... మార్, మదనపల్లి, పోలవరం జిల్లాలకు ఆమోదం... మంత్రుల కమిటీ నివేదికకు ముఖ్యమంత్రి ఓకే

Update: 2025-11-25 12:45 GMT

ఏపీలో కొత్తగా మరో మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు. అనంతరం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మదనపల్లె, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అలాగే అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కీలక నిర్ణయాలు

ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు అధ్య­క్ష­తన జి­ల్లాల పు­న­ర్వి­భ­జన, డి­వి­జ­న్లు, మం­డ­లాల మా­ర్పు చే­ర్పు­ల­పై సచి­వా­ల­యం­లో కీలక సమీ­క్ష జరి­గిం­ది. ఈ సం­ద­ర్భం­గా నూ­త­నం­గా మూడు జి­ల్లాల ఏర్పా­టు­కు ప్ర­భు­త్వం గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ది. ముం­దు నుం­చి చె­బు­తు­న్న­ట్టు­గా మా­ర్కా­పు­రం, మద­న­ప­ల్లి జి­ల్లాల ఏర్పా­టు­కు మం­త్రి­వ­ర్గం ఓకే చె­ప్పిం­ది. అలా­గే రం­ప­చో­డ­వ­రం కేం­ద్రం­గా పో­ల­వ­రం జి­ల్లా ఏర్పా­టు­కు అం­గీ­క­రిం­చా­రు. మం­త్రుల కమి­టీ ఇచ్చిన ని­వే­ది­క­పై సమీ­క్ష ని­ర్వ­హిం­చిన అనం­త­రం మా­ర్పు­లు చే­ర్పు­ల­కు ము­ఖ్య­మం­త్రి ఆమో­దం తె­లి­పా­రు. కొ­త్త­గా 5 రె­వె­న్యూ డి­వి­జ­న్ల­ను ఏర్పా­టు చే­సేం­దు­కు కూడా అం­గీ­క­రిం­చా­రు. అన­కా­ప­ల్లి జి­ల్లా­లో నక్క­ప­ల్లి, ప్ర­కా­శం జి­ల్లా­లో అద్దం­కి, కొ­త్త­గా ఏర్పా­ట­య్యే మద­న­ప­ల్లి జి­ల్లా­లో పీ­లే­రు, నం­ద్యాల జి­ల్లా­లో బన­గా­న­ప­ల్లె, శ్రీ­స­త్య­సా­యి జి­ల్లా­లో మడ­క­శిర రె­వె­న్యూ డి­వి­జ­న్లు ఏర్పా­టు­కు ని­ర్ణ­యిం­చా­రు. కర్నూ­లు జి­ల్లా పె­ద్ద హరి­వ­నా­న్ని కొ­త్త మం­డ­లం­గా ఏర్పా­టు­కు ని­ర్ణ­యం తీ­సు­కో­గా.. ఆదో­ని మం­డ­లా­న్ని వి­భ­జిం­చి కొ­త్త మం­డ­లం ఏర్పా­టు చే­సేం­దు­కు ము­ఖ్య­మం­త్రి ఓకే చె­ప్పా­రు. ఇక కొ­త్త జి­ల్లా­లు, రె­వె­న్యూ డి­వి­జ­న్ల ఏర్పా­టు­కు సం­బం­ధిం­చి నో­టి­ఫి­కే­ష­న్‌ వి­డు­ద­లైం­ది. అన­కా­ప­ల్లి జి­ల్లా­లో నక్క­ప­ల్లి రె­వె­న్యూ డి­వి­జ­న్, ప్ర­కా­శం జి­ల్లా­లో అద్దం­కి, కొ­త్త­గా ఏర్పా­ట­య్యే మద­న­ప­ల్లె జి­ల్లా­లో పీ­లే­రు రె­వె­న్యూ డి­వి­జ­న్, నం­ద్యాల జి­ల్లా­లో బన­గా­న­ప­ల్లె రె­వె­న్యూ డి­వి­జ­న్‌, సత్య­సా­యి జి­ల్లా­లో మడ­క­శిర రె­వె­న్యూ డి­వి­జ­న్‌ ఏర్పా­టు చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు.

Tags:    

Similar News