Amarnath yatra: అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం.. ఏపీ భక్తురాలు మృతి..

Amarnath yatra: అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన ఇద్దరు భక్తులు వరదల్లో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరు మృతి చెందారు.

Update: 2022-07-11 08:13 GMT

అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఏపీలోని రాజమండ్రికి చెందిన ఇద్దరు భక్తులు వరదల్లో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరొకరి కోసం అధికారులు గాలిస్తున్నారు. గల్లంతైన ఇద్దరు రాజమండ్రికి చెందిన సుధ, పార్వతీగా గుర్తించారు.

మరోవైపు రెండు రోజుల విరామం తర్వాత అమర్‌నాథ్ యాత్ర ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభమైంది. పహల్‌గామ్‌లోని నువాన్‌ బేస్‌ క్యాంపు నుంచి భక్తులు మంచు లింగం దర్శనానికి బయలుదేరారు. దాదాపు 2 వేల నుంచి 3 వేల మంది భక్తులను అనుమతించనున్నారు. బల్తాల్‌ క్యాంపు మార్గంలో దర్శనానికి వెళ్లేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు.

రెండు సంవత్సరాల విరామం తర్వాత జూన్‌ 30న అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. బల్తాల్‌, పహల్‌గామ్‌ క్యాంపుల నుంచి భక్తులు మంచు లింగం దర్శనానికి బయల్దేరారు. ఐతే శుక్రవారం సాయంత్రం కుంభవృష్టి కురవడంతో ఆకస్మికంగా వరదలు వచ్చాయి. ఈ వరదల్లో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ సహాయకచర్యలకు దిగింది. దీంతో రెండు రోజుల పాటు యాత్రను రద్దు చేసిన అధికారులు...ఇవాళ ఉదయం పునరుద్ధరించారు.

Tags:    

Similar News