APRTC : ఏపీఆర్టీసీ గుడ్ న్యూస్ .. సంక్రాంతికి 2,400 ప్రత్యేక బస్సులు

Update: 2024-12-28 14:15 GMT

సంక్రాంతికి హైదరాబాద్​ నుంచి ఏపీకి వెళ్లేవారికి ఏపీఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. పండగ సందర్భంగా 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 9 నుంచి 13 మధ్య ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని, అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. ప్రయాణికులు ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ నుంచి లేదా అధీకృత టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్ల నుంచి టికెట్లను ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చు. అయితే సంక్రాంతి పండుగకు బయలుదేరే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో.. జనవరి 10 నుంచి 12 వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, స్పెషల్‌ బస్సులు ఎంజీబీఎస్‌కు ఎదురుగా ఉన్న పాత సీబీఎస్‌ గౌలిగూడ నుంచి నడపనున్నట్టుగా ఏపీఎస్‌ఆర్టీసీ పేర్కొంది.

Tags:    

Similar News