Tirupati SP : సొంత వాహనాల్లో తిరుమల వెళ్తున్నారా?

Update: 2025-04-22 15:45 GMT

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సొంత వాహనాల్లో తిరుమలకొచ్చే భక్తులకు తిరుపతి SP సూచనలు చేశారు. ఇటీవల రెండు కార్లు దగ్ధమైన నేపథ్యంలో జాగ్రత్తలు చెప్పారు. ముందే వాహనాన్ని సర్వీసింగ్ చేయించుకోవాలని, రేడియేటర్ బెల్ట్, బ్యాటరీలో డిస్టిల్ వాటర్ చెక్ చేసుకోవాలన్నారు. దూరం నుంచి వచ్చే వాళ్లు ఘాట్ రోడ్డు ఎక్కడానికి ముందు 30 ని. వాహనాన్ని ఆపాలని, ఘాట్ రోడ్డు ఎక్కే సమయంలో AC ఆఫ్ చేసుకోవడం మంచిదని సూచించారు.

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో భక్తులకు TTD కీలక సూచన చేసింది. చాలా మంది తమకు కేటాయించిన టైమ్ స్లాట్‌కు బదులు ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నారని మండిపడింది. రద్దీ అధికంగా ఉండటంతో ఇలా చేయడం సరికాదని, కేటాయించిన టైమ్‌కు మాత్రమే రావాలని సూచించింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలోనే భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News