3 రాజధానులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టులో వాదనలు..

Update: 2020-10-05 06:48 GMT

3 రాజధానులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తం 229 పిటిషన్లుపెండింగ్‌లో ఉన్నాయన్న చీఫ్‌ జస్టిస్ అన్నారు. వీటిల్లో తొలి ప్రాధాన్యంగా 44 పిటిషన్లపై విచారణ చేపడతామని చెప్పారు. 185 పిటిషన్లపై వాదనలు తర్వాత వింటామని స్పష్టం చేశారు. ఇవాళ్టి విచారణలో భాగంగా విశాఖలో గెస్ట్‌హౌస్‌ల నిర్మాణంపై వాడివేడిగా వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం విశాఖలో 30 ఎకరాల్లో గెస్ట్‌హౌస్‌ నిర్మిస్తోందని పిటిషనర్ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఐతే ఇందుకు ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పడం లేదని అన్నారు. విశాఖతోపాటు కాకినాడ, తిరుపతిలో గెస్ట్‌హౌస్‌లు వీఐపీల కోసం అని చెప్తున్నారని కాకినాడలో 10 వేల చదరపు అడుగుల్లో గెస్ట్‌హౌస్‌ కడుతున్నారు.. ఇవన్నీ ఎందుకో ప్రభుత్వం చెప్పడం లేదన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది.

Tags:    

Similar News