Agneepath Protest: అగ్నిపథ్ అల్లర్ల కేసు.. ఏపీలో ఆర్మీ అభ్యర్థులు అరెస్ట్..
Agneepath Protest: అగ్నిపథ్ అల్లర్ల కేసులో ఏపీలోనూ ఆర్మీ అభ్యర్థులు అరెస్ట్ అయ్యారు.;
Agneepath Protest: అగ్నిపథ్ అల్లర్ల కేసులో ఏపీలోనూ ఆర్మీ అభ్యర్థులు అరెస్ట్ అయ్యారు. అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాలకు చెందిన పలువురు అభ్యర్థులను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే తాము ఆర్మీ రిక్రూట్‌మెంట్ వివరాలు తెలుసుకునేందుకు గుంటూరు వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. ఆవేదనతో సెల్‌ఫోన్‌లో వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారని.. తమకు ఏమీ తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.