ASG: అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా కనకమేడల

Update: 2025-12-23 11:30 GMT

అద­న­పు సొ­లి­సి­ట­ర్‌ జన­ర­ల్‌­గా మాజీ ఎంపీ కన­క­మే­డల రవీం­ద్ర­కు­మా­ర్‌ ని­య­మి­తు­ల­య్యా­రు. సు­ప్రీం­కో­ర్టు­లో మరో ఇద్ద­రు అద­న­పు సొ­లి­సి­ట­ర్‌ జన­ర­ల్స్‌­ను కేం­ద్రం తా­జా­గా ని­య­మిం­చిం­ది. కన­క­మే­డ­ల­తో పాటు దవీం­ద­ర్‌­పా­ల్‌ సిం­గ్‌­ను ని­య­మి­స్తూ కేం­ద్ర ప్ర­భు­త్వం ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఈ మే­ర­కు కేం­ద్ర కే­బి­నె­ట్‌ ని­యా­మ­కాల కమి­టీ ఆమో­దం­తో న్యా­య­శాఖ ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది.  మరోవైపు కనకమేడల రవీంద్ర కుమార్‌ గతంలో తెలుగుదేశం పార్టీ తరుఫున రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. రాజకీయాలతో పాటుగా న్యాయరంగంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్ర కుమార్‌ను సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల రవీంద్ర కుమార్.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై కీలక పాత్ర పోషించనున్నారు. 

Tags:    

Similar News