రామతీర్థం ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజు తొలిగింపు!
రామతీర్థం ట్రస్ట్ చైర్మెన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తోలిగించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది.;
రామతీర్థంలో చంద్రబాబు పర్యటనపై సర్కారు కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. రామతీర్థం ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి అశోకగజపతి రాజును తొలగించారు. ఈ ఆలయానికి ఆయన అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు. దీంతో పాటు పైడితల్లి, మందపల్లి ఆలయాల ట్రస్టు ఛైర్మన్ పదవి నుంచి కూడా ఆయన్ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల పర్యవేక్షణలో అశోక్ గజపతిరాజు విఫలం అయ్యారని దేవాదాయశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.