తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న అసెంబ్లీ సీట్లు..?

Update: 2025-12-16 08:15 GMT

ఏపీ, తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడే చట్టంలో వీటిని చేర్చారు. తెలంగాణలో ఉన్న 119 సీట్లను 153 కు, ఏపీలో ఉన్న 175 సీట్లను 225కు పెంచాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు గతంలోనే కేంద్రాన్ని కోరాయి. ఇంకొందరు దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కీలక విషయం వెల్లడించింది. త్వరలోనే జరగబోయే డీలిమిటేషన్ లోనే దీన్ని కూడా కంప్లీట్ చేస్తామని తెలిపింది. అంటే ఈ లెక్కన 2029 లోపే అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు చాలా కలిసొచ్చే అంశం. దీనివల్ల పార్టీల్లో ఆశావాహులుగా మిగిలిపోతున్న వారందరికీ అవకాశం వస్తుంది.

అంతేకాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఎమ్మెల్యే కావచ్చు. అటు మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేసే అవకాశాలు కూడా దీని వల్ల సులభమవుతాయి. పాలనా పరంగాను ఎమ్మెల్యే నియోజకవర్గాలు పెరిగితే ప్రజలకు చాలా అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో ఎక్కువగా పనులపై దృష్టి పెట్టే అవకాశాలు వస్తాయి. నియోజకవర్గాల పరిధి తగ్గిపోయినప్పుడు పాలనాపరమైన అంశాలు చాలా ఈజీ అయిపోతాయి. ప్రజలకు ఎమ్మెల్యేలకు మధ్య రిలేషన్ బాగా పెరుగుతుంది.

నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్ గా రిజర్వేషన్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అటు మహిళలకు కావచ్చు మిగతా బలహీన వర్గాలకు కూడా అవకాశాలు పెరుగుతాయి. అంటే వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరిగితే ఎన్నికల పోరు మరింతగా పెరుగుతుంది. అప్పుడు రాజకీయ పార్టీల భవిష్యత్తును ఈ కొత్తగా వచ్చే నియోజకవర్గాలు శాసిస్తాయి. నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటే పార్టీలో అసంతృప్తులు చాలా వరకు తగ్గిపోతారు. గెలుపు ఓటములపై కూడా అంచనాలు మారిపోతాయి. మరి ఈ కొత్త నియోజకవర్గాలకు కేంద్రం ఎప్పుడు ఆమోదం తెలుపుతుందో చూద్దాం.


Full View

Tags:    

Similar News