విజయవాడలో ఏపీ రాజ్భవన్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు, ‘పద్మ’ అవార్డు గ్రహీతలు, వివిధ రంగాల ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయజెండాను ఆవిష్కరించారు.
మరోవైపు తెలంగాణ రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన వారి వద్దకు గవర్నర్, సీఎం వెళ్లి పలకరించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయపతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.