NTR District : డబ్బు కోసం దారుణం... మేనత్తపై దాడి..

Update: 2025-08-12 14:15 GMT

డబ్బు కోసం సొంత మేనత్త పైనే దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. మద్యానికి బానిసై ఆస్తి కోసం తన అత్తను చంపడానికి ప్రయత్నించాడు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకునిపాలెంలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. అవసరాలకు చేతిలో డబ్బు లేకపోవడంతో మేనత్త మరియమ్మ ఆస్తిపై కన్నేశాడు. పలుమార్లు ఆస్తి కోసం ఆమె పై ఒత్తిడి చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె ఆస్తి ఇచ్చేందుకు నిరాకరించడంతో మద్యం మత్తులో ఉన్న నరేంద్ర కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మరియమ్మ తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆమెను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నరేంద్ర పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసినపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో తన తండ్రిపై కూడా నరేంద్ర దాడి చేసి హతమార్చాడని పోలీసుల విచారణలో తేలింది.

Tags:    

Similar News