అనంతపురం జిల్లా, శింగనమల మండల కేంద్రంలోని శ్రీ రంగరాయ చెరువు ఆయకట్టు కింద ఉన్న చిన్న కాలువ తూములో కొందరు వ్యక్తులు చేపలు పట్టడానికి వల వేయడంతో పసికందు వలలో పడింది. చేపలు పట్టడానికి వచ్చిన వారికి వలలో పడ్డ చిన్నారి మృతదేహాన్ని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సింగనమల గ్రామానికి చెందిన యువకులు ఆ నలుగురు మానవత్వంతో ముందుకు వచ్చి ఆ పసికందు బౌతికయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఏ తల్లి కన్నదో.. ఎందుకు విసిరేసిందో అంటూ మత్స్యకారులు బాధపడుతూ కనిపించారు.