BALAYYA: అపర దానకర్ణుడు... నందమూరి బాలకృష్ణుడు

వరల్డ్ రికార్డ్ సింహం: బాలయ్య గౌరవం... బాలకృష్ణ 50 ఏళ్ల సినీ జర్నీ, అంతర్జాతీయ అవార్డు... క్యాన్సర్ రోగులకు సేవలతో వరల్డ్ రికార్డ్స్‌లో బాలయ్య*;

Update: 2025-08-26 05:45 GMT

నటసింహం నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారానికి బాలయ్య ఎంపికయ్యారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఎడిషన్ లో చోటు దక్కించుకున్నారు. దీంతో భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇలాంటి గౌరవం పొందిన మొట్టమొదటి నటుడిగా బాలకృష్ణ రికార్డుల‌కెక్కాడు. బాలయ్య అద్భుత నటనతో, కళపట్ల నిబద్ధతతో బాలకృష్ణ సినిమా రంగంపై తనదైన ముద్రవేశారని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది.

వైద్య సేవలు మరింత విస్తృతం

నందమూరి బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ నుంచి కేవలం నటనను మాత్రమే వారసత్వంగా తీసుకోలేదు. ఆయన సేవా గుణాన్ని కూడా అందిపుచ్చుకుని అనేక మంది ప్రజల గుండెల్లో చోటు దక్కించుకున్నారు. అయితే బాలయ్య కోపం, నటన, రాజకీయాలు నాణానికి ఓ వైపు అయితే సేవా, దాతృత్వపు హృదయం మరోవైపు. అయితే ఈయన్ని ట్రోల్ చేస్తున్న చాలామందికి బాలయ్య చేస్తున్న ప్రజా ఉచిత సేవ గురించి తెలియదు. క్యాన్సర్ రోగులకు వైద్యం అందుబాటులో ఉండాలని బాలకృష్ణ తల్లి బసవతారకం కోరిక మేరకు స్వర్గీయ నటుడు నందమూరి తారకరామారావు ఈ ఫౌండేషన్‌కు నాంధి పలికినట్టు బాలయ్య తెలిపారు. ఆయన సతీమణి పేరుమీద బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్‌ను 1988లో స్థాపించారు. ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్(IACO) యుఎస్ఎ వారి సహకారంతో బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇండియాను 2000వ సంవత్సరంలో జూన్ 22న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు.

విశేష వైద్యసేవలు అందిస్తూ దేశంలో అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. 2010 ఏప్రిల్ 10న ఈ ఆసుపత్రికి బాలయ్య చైర్మన్‌గా, మేనేజింగ్ ట్రస్టీగా ఎంపికయ్యి అప్పటి నుంచి ఆసుపత్రి బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న నందమూరి కుటుంబం దీన్ని మరింత విస్తరించే యోచనలో ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసం అనేకమంది రోగులు తరలివస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందించి పేద క్యాన్సర్ రోగులకు ఎయిర్ కండిషన్డ్‌ వార్డ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు బాలకృష్ణ ఓ సందర్భంలో తెలిపారు. ఈ సేవల్ని మరింత విస్తరించేందుకు ఏపీ రాజధాని అమరావతిలో ఆసుపత్రి నిర్మాణానికి బాలయ్య ఇటీవల శంకుస్థాపన చేశారు. ఇది కూడా అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ ఆసుపత్రి లాభాపేక్ష కోసం కాకుండా పేద రోగులకు సేవ చేసేందుకు బాలయ్య అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వచ్చాయని బాలయ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ట్రోలింగ్‌ను పట్టించుకోకుండా తనదైన శైలిలో ముందుకు..

ఈయన నటనతో మ్యాన్ ఆఫ్ మ్యాసెస్, నటసింహం వంటి బిరుదులు సొంతం చేసుకున్నారు. కేవలం సినిమాల్లో కాకుండా రాజకీయాల్లో అందె వేశారు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఓ హిస్టరీ క్రియేట్ చేసుకున్నారు. సినిమాతోపాటు బాలకృష్ణ సమాజానికి సేవ చేస్తూ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషన్ కూడా ఈ ఏడాదే అందుకున్నారు. బాలయ్య తన నిజజీవితానికి అనుగుణంగానే ఆయన తీసే సినిమాలు ఉంటాయి. మాస్, యాక్షన్, పౌరాణిక, చారిత్రక, సామాజిక కథలను ఎంపిక చేసుకుని ఆ పాత్రలో లీనమవుతారు. కథలో ఎంత సీరియస్ గా ఉంటారో దైనందిన జీవితంలో అలానే ఉంటారు. అయితే ప్రజల పాలనలో ఉన్నప్పుడు బాలయ్య ఇదే సీరియస్‌ను మెయింటెన్ చేయటంతో ఈయన్ని కోపిష్టిగా కొందరు భావిస్తారు. సెల్పీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకోవటం, అభిమానుల బొకే తీసుకుని విసిరేయటం వంటివి అభిమానుల్ని కొంత బాధ కలిగిస్తుంది. అయితే అభిమానులకు కొంత హద్దు ఉంటుంది అది దాటితే ఎవ్వరికైనా కోపం వస్తుందని బాలయ్యను కొందరు వెనకేసుకొచ్చి సమర్థిస్తారు. బాలనటుడిగా తెరంగేట్రం చేసిన బాలయ్య ఆరు పదుల వయసులో యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు తీస్తున్నారు. ఈ వయసులో కష్టపడుతూ నటనతో తన అభిమానులను మెప్పిస్తూ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారు. అయితే బాలయ్యను అభిమానించే వారికంటే క్రిటిసైజ్ చేసేవారే ఎక్కువ ఉంటారు. అయితే సమాజంలో ఎదుగుతున్న వ్యక్తిపై ఇలాంటి ట్రోలింగ్ కామన్ అని ఇలాంటివేమి పట్టించుకోకుండా బాలయ్య మరింత ఉత్సాహంగా సరికొత్తగా బాలయ్య తనదైన శైలిలో ముందుకు సాగుతారు.

Tags:    

Similar News