ఎమ్మెల్యే కాటసాని అక్రమమైనింగ్‌తో కోట్లు కొల్లగొడుతున్నారు : బీసీ జనార్థన్ రెడ్డి
బనగానిపల్లి ఎమ్మెల్యే కాటసాని అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బీసీ జనార్థన్ రెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లా బనగానపల్లి రవ్వలకొండలో భారీ పేలుళ్ళ జరిగిన మైనింగ్ ప్రాంతాన్ని బీసీ జనార్థన్ రెడ్డి సందర్శించారు. అధికారన్ని అడ్డంపెట్టుకుని అక్రమమైనింగ్‌తో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న కాటసానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.