కృష్ణా జిల్లా పెద్దవరంలో క్రక్స్ బయోటెక్ కంపెనీలో భారీ పేలుడు..!
కృష్ణా జిల్లా నందిగామ మండలం పెద్దవరంలో ఉన్న క్రక్స్ బయోటెక్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.;
కృష్ణా జిల్లా నందిగామ మండలం పెద్దవరంలో ఉన్న క్రక్స్ బయోటెక్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ఘటనను రహస్యంగా ఉంచింది యాజమాన్యం. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా... వారిని కంపెనీలోకి అనమతించలేదు. పేలుడులో గాయపడినవారిలో ఒకరు బీహార్‌కుచెందిన కార్మికుడు కాగా... మిగిలినవారు వేదాద్రితో పాటు చట్టుపక్కల గ్రామాలకు చెందినవారిగా తెలుస్తోంది.