YSRCP : వైసీపీకి బిగ్ షాక్.. ఆళ్ల నాని రాజీనామా

Update: 2024-08-17 11:45 GMT

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల నాని ప.గో. జిల్లా అధ్యక్ష, ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇదే విషయమైన మీడియాతో మాట్లాడారు ఆళ్ల నాని.. గతంలో పార్టీ పదవులకు, ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అప్పుడు, ఇప్పుడూ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసినట్లు నాని తెలిపారు. కార్యాలయ స్థలం లీజు ముగిసిందని.. దాంతో స్థలాన్ని యజమానికి అప్పగించామన్నారు. స్థల యజమాని అనుమతితోనే కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించామని చెప్పారు. ఆ తరువాతే పార్టీ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను కూల్చివేశామని ఆళ్ల నాని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News