వైసీపీది కుటుంబ పాలన, ట్రేడింగ్ పాలన : సోము వీర్రాజు
30 లక్షల పట్టాలను 7 వేలు కోట్లకు కొని... ఎమ్మెల్యేల జేబులు నింపుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాజమండ్రిలో 500 ఎకరాల స్థలం..;
30 లక్షల పట్టాలను 7 వేలు కోట్లకు కొని... ఎమ్మెల్యేల జేబులు నింపుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాజమండ్రిలో 500 ఎకరాల స్థలం కొనుగోలులో అవినీతి జరిగిందన్నారు. వైసీపీది కుటుంబ పాలన, ట్రేడింగ్ పాలన అంటూ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. బీహార్, తెలంగాణ ఫలితాలు ఆనందంగా ఉందని.. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచి పార్టీలో చేరికలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మంచి ఉద్దేశ్యంతో వాజ్‌పేయి ప్రవేశపెట్టిన అర్బన్ హెల్త్ సెంటర్లలో వైసీపీ ప్రభుత్వం అవినీతి చేస్తోందని మండిపడ్డారు. కోటి కోడిగుడ్లు కొంటున్నట్లు చెప్పి స్కాంకు పాల్పడిందని మండిపడ్డారు.