ఏపీ నా పుట్టినిల్లు... నేను తెలుగు ఆడబిడ్డనే : బీజేపీ ఎంపీ అభ్యర్ధి రత్నప్రభ
ఏపీలో జరిగిన అభివృద్ధిలో కేంద్రం నిధులే ఎక్కువగా ఉన్నాయన్నారు. 22 మంది వైసీపీ ఎంపీల వల్ల ఏం ఉపయోగం లేదని విమర్శించారు.;
ఆంధ్రప్రదేశ్ తన పుట్టిల్లేనన్నారు తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్ధి రత్నప్రభ. తాను తెలుగు ఆడబిడ్డనని గుర్తుచేశారు. తిరుపతి ఎంపీ సీటు.. ప్రధాని తనకు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. ఏపీలో జరిగిన అభివృద్ధిలో కేంద్రం నిధులే ఎక్కువగా ఉన్నాయన్నారు. 22 మంది వైసీపీ ఎంపీల వల్ల ఏం ఉపయోగం లేదని విమర్శించారు. జనసేన నుంచి బీజేపీకి పూర్తి మద్దతు ఉందన్న ఆమె... త్వరలో పవన్ కల్యాణ్ తిరుపతి పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేస్తారన్నారు. కాగా వైసీపీ దమనకాండను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. వైసీపీ, టీడీపీలకు ధీటైన వ్యక్తిని నిలబెట్టామన్న ఆయన.. తిరుపతి ఉపఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.