అంతర్వేది ఘటను తీవ్రంగా పరిగణిస్తాం : విష్ణు కుమార్ రాజు
అంతర్వేది ఘటను తీవ్రంగా పరిగణిస్తామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. హిందూ మతాన్ని..;
అంతర్వేది ఘటను తీవ్రంగా పరిగణిస్తామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. హిందూ మతాన్ని నిర్వీర్యానికే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం హిందూ మాత మనోభావాలను లెక్క చేయడం లేదని విమర్శించారు. బీజేపీ నాయకుల హౌస్ అరెస్టు దారుణమని మండిపడ్డారు. బీజేపీ శాంతియుతంగానే నిరసనలు చేపడుతుంటే..... భయబ్రాంతులకు గురి చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విష్ణు కుమార్ రాజు ధ్వజమెత్తారు. ఇంతటి దారుణమైన ఘటనలు జరుగుతున్నా సీఎం స్పందించడం లేదని విమర్శించారు. అంతర్వేది ఘటన పిచ్చివాడి చర్య అనడం దారుణమని విష్ణు కుమార్ రాజు ధ్వజమెత్తారు.