వైసీపీ బ్యాచ్ అరాచకాలు రోజురోజుకూ హద్దులు దాటిపోతున్నాయి. ఏపీలో అధికారంలేకపోయినా సరే వాళ్ల ఆగడాలు మామూలుగా ఉండట్లేదు. ఏకంగా జగన్ ఫ్లెక్సీలకు భయంకరంగా రక్తాభిషేకాలు చేస్తున్నారు. జగన్ ఫ్లెక్సీల ముందు మేకలు, గొర్రెలు లేదా ఇతర జంతువులను బలిస్తూ తమ క్రూరత్వాన్ని బయటపెడుతున్నారు. పైగా ఆ ఫ్లెక్సీలపై రప్పా రప్పా అంటూ రాయిస్తున్నారు. 2029లో గంగమ్మ జాతరే అంటూ భయంకరమైన రాతలు రాయిస్తున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నా సరే జగన్ మాత్రం వారిని ఏమీ అనట్లేదు. వీళ్లు ఇప్పుడే ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే రేపు ఒకవేళ అధికారంలోకి గనక వస్తే మనుషులను కూడా ఇలాగే నరికేస్తారేమో అంటూ భయపడుతున్నారు సామాన్య జనాలు.
ఎందుకంటే వైసీపీ బ్యాచ్ ఆగడాలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి. నడిరోడ్డుపై మనుషులు కూడా భయపడేలా జంతువులను చంపేస్తున్నారు. వాటి రక్తాన్ని తీసుకెళ్లి జగన్ ఫొటోలకు రాస్తున్నారు. అంటే జగన్ ను వాళ్లు బలికోరుకునే వ్యక్తిగా ముద్రిస్తున్నారు. ఇంత ఘోరంగా వాళ్లు ఆగడాలు సృష్టిస్తుంటే జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. ఇదే ఇక్కడ అసలైన ప్రశ్న అని చెప్పాలి. జగన్ అవతలి పార్టీలకు నీతులు చెప్తాడు కదా.. మరి తన పార్టీ నేతలే ఇలా రెచ్చిపోతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అని ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు. ఇంత ఘోరంగా రక్తాభిషేకాలు చేయడం ఏంటి.
అసలు వీళ్లు మనుషులేనా. జగన్ కండ్లలో ఆనందం చూడటం కోసం ఎంతకైనా తెగిస్తారా. ఈ రప్పా రప్పా బ్యాచ్ ఇలాగే రెచ్చిపోతే ఏపీలో అసలు శాంతిభద్రతలు ఏమైనా ఉంటాయా. ఒక రాజకీయ పార్టీ అంటే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. ఎడ్యుకేషన్, టెక్నాలజీని ప్రోత్సహించాలి గానీ.. ఇలా బలి ఇవ్వడాన్ని కోరుకోవడం ఏంటి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇలాంటి బలి చేయడాలు వైసీపీ బ్యాచ్ కు ఫ్యాషన్ గా మారిపోయాయి. వీటిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా సరే వాళ్లు మాత్రం తగ్గట్లేదు. మరి జగన్ కనీసం వాటిపై స్పందిస్తాడా లేదా చూడాలి.