BOMB THREAT: చంద్రబాబు, జగన్ ఇళ్లకు బాంబు బెదిరింపులు

తిరుపతికి కూడా బాంబు బెదిరింపులు... స్టాలిన్, త్రిష ఇళ్లకు కూడా వార్నింగ్.. అప్రమత్తమైన పోలీసులు, తనిఖీలు... పోలీసులకు బెదిరింపుల మెయిల్

Update: 2025-10-03 11:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రం­లో పలు ప్రాం­తా­ల్లో బాం­బు బె­ది­రిం­పు హె­చ్చ­రి­క­లు తీ­వ్ర అల­జ­డి రే­పా­యి. రా­ష్ట్ర ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు, మాజీ సీఎం వై­ఎ­స్ జగన్ మో­హ­న్ రె­డ్డి ఇళ్ల­తో పాటు తి­రు­ప­తి­లో­ని పలు ప్రాం­తా­ల్లో కూడా బాం­బు­లు పె­ట్టి­న­ట్లు బె­ది­రిం­పు ఈ- మె­యి­ల్స్ వచ్చా­యి. ‘హోలి ఇస్లా­మి­క్ ఫ్రై­డే బ్లా­స్ట్స్’ పే­రు­తో భారీ పే­లు­ళ్ల­కు ప్లా­న్ చే­సి­న­ట్లు ఆ మె­సే­జ్ లో తె­లి­పా­రు. దీం­తో అప్ర­మ­త్త­మైన పో­లీ­స్ అధి­కా­రు­లు.. ఆయా ప్రాం­తా­ల­ను క్షు­ణ్ణం­గా తని­ఖీ చే­శా­రు. అను­మా­నం వచ్చిన ప్ర­తి దా­న్ని అడు­గ­డు­గు­నా చెక్ చే­శా­రు. ఈ నెల 6వ తే­దీన తి­రు­ప­తి­లో సీఎం చం­ద్ర­బా­బు పర్య­టన ఉన్న నే­ప­థ్యం­లో బాం­బ్ స్వ్కా­డ్ సి­బ్బం­ది­తో పాటు ఉన్న­తా­ధి­కా­రు­లు అల­ర్టు అయ్యా­రు. తా­జా­గా, బాం­బు బె­ది­రిం­పు­ల­తో తి­రు­ప­తి, శ్రీ­కా­శ­హ­స్తి­లో­నూ క్షు­ణ్ణం­గా తని­ఖీ­లు కొ­న­సా­గి­స్తు­న్నా­రు. తి­రు­ప­తి అగ్రి­క­ల్చ­ర్ కా­లే­జీ­లో­ని ము­ఖ్య­మం­త్రి హె­లి­పా­డ్ దగ్గర కూడా ని­శీ­తం­గా పరి­శీ­లన చే­స్తు­న్నా­రు. తి­రు­ప­తి పట్ట­ణం­లో హై టె­న్ష­న్. టౌన్ లోని నా­లు­గు చో­ట్ల RDX బాం­బు­లు పె­ట్టాం అంటూ గు­ర్తు తె­లి­య­ని వ్య­క్తుల నుం­చి పో­లీ­సు­ల­కు ఈ మె­యి­ల్స్ వచ్చా­యి. తి­రు­ప­తి పట్ట­ణం­లో­ని ఆర్టీ­సీ బస్టాం­డ్, శ్రీ­ని­వా­సం, వి­ష్ణు ని­వా­సం, కపిల తీ­ర్థం ఆలయం, గో­విం­ద­రా­జుల స్వా­మి ఆలయం, న్యా­య­మూ­ర్తుల ని­వాస సము­దా­యం, కో­ర్టు ప్రాం­గ­ణం ప్రాం­తా­ల్లో తని­ఖీ­లు చే­ప­ట్టా­రు. బాం­బ్, డాగ్ స్క్వా­డ్ తో తని­ఖీ­లు చే­శా­రు. 6వ తేదీ సీఎం చం­ద్ర­బా­బు తి­రు­ప­తి­లో పర్య­టిం­చ­ను­న్నా­రు. ఈ క్ర­మం­లో­నే ఉగ్ర­వా­దుల పే­రు­తో బె­ది­రిం­పు­లు రా­వ­టం­తో పో­లీ­సు­లు వి­స్త్రృ­తం­గా తని­ఖీ­లు చే­ప­ట్టా­రు.

తమిళనాడులోనూ...

తమి­ళ­నా­డు­లో­నూ బాం­బు బె­ది­రిం­పు­లు కల­క­లం సృ­ష్టిం­చా­యి. స్తు­న్నా­యి. సినీ, రా­జ­కీయ ప్ర­ము­ఖుల ఇళ్ల­తో పాటు పలు ప్ర­దే­శా­ల­కు బాం­బు బె­ది­రిం­పు­లు వచ్చా­యి. దీం­తో అధి­కా­రు­లు అప్ర­మ­త్త­మ­య్యా­రు. ము­ఖ్య­మం­త్రి ఎంకే స్టా­లి­న్‌, సినీ నటి త్రిష ని­వా­సా­ల­తో పాటు బీ­జే­పీ ప్ర­ధాన కా­ర్యా­ల­యా­ని­కి, డీ­జీ­పీ ఆఫీ­సు­కి, రా­జ్‌­భ­వ­న్‌­కు కూడా బాం­బు బె­ది­రిం­పు­లు వచ్చా­యి. దీం­తో భద్ర­తా బల­గా­లు అప్ర­మ­త్త­మ­య్యా­యి. ఆయా ప్రాం­తా­ల్లో బాం­బు స్క్వా­డ్‌ బృం­దా­లు, డా­గ్‌ స్క్వా­డ్‌ల సహా­యం­తో క్షు­ణ్ణం­గా తని­ఖీ­లు ని­ర్వ­హి­స్తు­న్నా­రు.

Tags:    

Similar News