విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు సజీవ దహనం
గోకవరం నుంచి వైజాగ్‌కు వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది.;
*తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఘోర ప్రమాదం
*విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు
*ఇద్దరు సజీవ దహనం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
*మంటల్లో పూర్తిగా దగ్ధమైన కారు
* ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమయ్యారు.
కరెంట్ స్తంభం విరిగి కారుపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కారు పూర్తిగా దగ్ధమయ్యింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉండగా.. వారిలో ఇద్దరు మంటల్లో చిక్కుకుని మరణించారు. గోకవరం నుంచి వైజాగ్‌కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.