BETTING APPS: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్... సినీ స్టార్లపై కేసు

దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ పై కేసు;

Update: 2025-03-20 06:00 GMT

తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ సెలబ్రెటీలు ఇప్పుడు కేసుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న 11 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు మరో 25 మందిపై కేసులు రిజిస్టర్ చేశారు. వీరిలో చాలా మంది అగ్రనటులు ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు సినీ ప్రముఖులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్ సహా 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

టాలీవుడ్ ను కుదిపేస్తున్న "బెట్టింగ్ భూతం"

టాలీవుడ్ ఇండస్ట్రీని బెట్టింగ్ యాప్స్ భూతం కుదిపేస్తోంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన యాంకర్లు, యూట్యూబ్ ప్రమోటర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు టాప్ హీరోలపైనా కేసులు నమోదు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్స్ కేసు కీలక మలుపు తిరిగింది. వందలమంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్ ను సినీ నటులు ప్రమోట్ చేయడంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి

కేసు నమోదైంది వీళ్లపైనే

రానా దగ్గుబాటి

విజయ్‌ దేవరకొండ

ప్రకాశ్‌రాజ్‌,

మంచులక్ష్మి

నిధి అగర్వాల్

యాంకర్ శ్రీముఖి

వర్షిణి

సిరి హన్మంతు

అనన్య నాగళ్ల

విష్ణు ప్రియ

టేస్టీ తేజ

ప్రణతీ

వంశీ సౌందర్ రాజన్

వసంతకృష్ణ

శోభా శెట్టి

అమృత చౌదరీ

Tags:    

Similar News