YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారి రామ్‌సింగ్‌కు ఊరట..
YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.;
YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రామ్‌సింగ్‌పై నమోదుచేసిన కేసుపై స్టే విధించింది. కడప కోర్టు ఆదేశాలతో రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేయగా.. సీబీఐ ఈ రోజు హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు అధికారిపై కేసు నమోదుచేయడం పట్ల సీబీఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తదనంతర చర్యలన్నింటిపై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు ధర్మాసనం.. రామ్‌సింగ్‌పై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించింది.