CBN: కొత్త అవకాశాల కేంద్రం.. అమరావతి
యూఏఈలో కొనసాగిన చంద్రబాబు పర్యటన.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ.. జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్ సేవలు.. ఇన్నోవేషన్‌కు కేంద్రంగా అమరావతి
ఏపీ రాజధాని అమరావతి కొత్త అవకాశాలకు, ఇన్నోవేషన్‌కు కేంద్రంగా ఉంటుందని వివరించారు సీఎం చంద్రబాబు.. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు.. రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తామని, పెట్టుబడులపై ఆలోచన చేస్తామని చంద్రబాబుకు తెలిపారు ప్రతినిధులు.. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు.. ఇక, భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏడీఎన్ఓసీ ఆసక్తి చూపింది.. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించిన చంద్రబాబు.. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వివరించారు.. పెట్రో కెమికల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందన్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని.. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు.
అబుదాబీలోని పారిశ్రామిక వేత్తలతో నెట్వర్క్ లంచ్‌లో చంద్రబాబు బృందం పాల్గొంది.. జీ 42 సీఈవో మనుకుమార్ జైన్, ఏడీఐసీ గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, ఐహెచ్సీ సీఈవో అజయ్ భాటియా, డబ్ల్యుఐవో బ్యాంక్ సీఈవో జయేష్ పాటిల్.. పాలిగాన్ మార్ఫిక్ సీఈవో జయంతి కనాని, ట్రక్కర్ సీఈవో గౌరవ్ బిశ్వాస్, పాలసీ బజార్ గ్రూప్ సీఈవో యశిష్ దహియా, ఇన్స్యూరెన్స్ మార్కెట్ సీఈవో అవినాష్… ఇన్సార్ట్స్ సీఈవో ఇక్బాల్, జీఐఐ సీఈవో పంకజ్ గుప్తా, నూన్ సీఈవో ఫరాజ్ ఖలీద్, ఇన్సెప్షన్ సీఈవో ఆశీష్ కోషితో నెట్వర్క్ సమావేశం జరిగింది.
విశాఖ సదస్సుకు రండి..
నవంబర్ 14,15 తేదీల్లో విశాఖలో జరిగే పార్ట్నర్ షిప్ కాన్ఫరెన్స్ కు రావాలని అహ్మద్ జాసిమ్ అల్ జాబీ, జీ 42 సీఈఓ మాన్సూరీని ఆహ్వానించారు. త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి, పెట్టుబడులపై ఆలోచిస్తామని వారు తెలిపారు. అనంతరం అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయి.. ఏపీలో ఇంధనరంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను గురించి వివరించారు. పెట్రో కెమికల్ కంపెనీలు ఏర్పాటు చేసి.. కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని వివరించారు. దుబాయ్ వేదికగా పెట్టుబడుల సాధనలో భాగంగా చేపట్టిన రోడ్ షోలో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషనుకు యూఏఈ పారిశ్రామికవేత్తలు రెస్పాండ్ అయ్యారు. సీఎం ప్రజెంటేషనుకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు పారిశ్రామికవేత్తలు.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. వ్యవసాయం మొదలుకుని టెక్నాలజీ వరకు.. గనులు మొదలుకుని స్పేస్ టెక్నాలజీ వరకు.. చిప్ మొదలుకుని షిప్ బిల్డింగ్ వరకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. పెట్టుబడుల గురించే కాకుండా.. ప్రజా సంక్షేమం కోణంలో చేస్తున్న పాలనాంశాలను గురించి సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి వస్తోన్న భారీ పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
యూఏఐ పర్యటనపై బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న దుబాయ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎంకు ఘనస్వాగతం లభించింది. స్థానిక భారతీయ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, దుబాయ్ నగర శాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విశ్వేశరరావు, ముక్కు తులసి కుమార్, తెలుగు సంఘం అధ్యక్షుడు మసీయోద్దీన్, ఇతర అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. చంద్రబాబును ఆహ్వానించేందుకు ప్రవాసాంధ్ర మహిళలు కూడా పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. యూఏఈలో సీఎం మూడు రోజులపాటు పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సదస్సులో భారీగా పెట్టుబడులు తేవాలని సంకల్పించుకున్నారు.