CBN: చంద్రబాబు కీలక పిలుపు

అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని పిలుపు

Update: 2025-12-09 08:15 GMT

ఏపీలో డిసెంబర్ 11 నుంచి 25 వరకు నిర్వహించే అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన యాత్రలో ఎన్డీఏ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ వాజ్ పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా ఈ యాత్రను బీజేపీ తలపెట్టిందన్నారు. దేశంలో సుపరిపాలనకు నాంది పలికిన నాయకులు వాజ్ పేయీ అన్నారు. తనకు వాజ్ పేయీతో మంచి అనుబంధం ఉండేదన్నారు. వా­జ్‌­పే­య్‌­తో తన­కు­న్న వ్య­క్తి­గత అను­బం­ధా­న్ని కూడా చం­ద్ర­బా­బు గు­ర్తు­చే­సు­కు­న్నా­రు. "రా­ష్ట్రా­భి­వృ­ద్ధి కోసం ఏది అడి­గి­నా కా­ద­నే­వా­రు కాదు. వి­ధా­న­ప­ర­మైన ని­ర్ణ­యా­లు వే­గం­గా తీ­సు­కు­నే­వా­రు" అని తె­లి­పా­రు. సు­ప­రి­పా­లన వి­ష­యం­లో ఎన్టీ­ఆ­ర్, వా­జ్‌­పే­య్ ఇద్ద­రూ ఒకే­లా ఉం­డే­వా­ర­ని, వారి వ్య­క్తి­త్వా­లు వి­శి­ష్ట­మై­న­వ­ని పే­ర్కొ­న్నా­రు. ప్ర­ధా­ని నరేం­ద్ర మోదీ కూడా వా­జ్‌­పే­య్ స్ఫూ­ర్తి­తో­నే దే­శా­న్ని ముం­దు­కు నడి­పి­స్తు­న్నా­ర­ని చం­ద్ర­బా­బు అన్నా­రు. 2047 నా­టి­కి భా­ర­త్‌­ను ప్ర­పం­చం­లో­నే నెం­బ­ర్ వన్ స్థా­నం­లో ని­ల­పా­ల­న్న లక్ష్యం­తో పని­చే­స్తు­న్నా­ర­ని, యు­వ­త­కు ఆయన స్ఫూ­ర్తి­గా ని­లు­స్తు­న్నా­ర­ని తె­లి­పా­రు.

నాడు అణు పరీక్షలు అయినా, నేడు ఆపరేషన్ సింధూర్ అయినా, నాడు చతుర్భుజి అయినా, నేడు సాగరమాల అయినా అవి ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలని సీఎం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశాన్ని 2047కు నెంబర్ వన్ చేసేందుకు పని చేస్తున్నారని వెల్లడించారు. 2047 నాటికి ఇండియా, ఇండియన్స్ నెంబర్ స్థానానికి వెళ్తారని జ్యోష్యం చెప్పారు. యువతరానికి మోదీ ఒక స్ఫూర్తినిస్తున్నారన్నారు. వాజ్‌పేయ్ శతజయంతి కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News