CBN: జీఎస్టీ సంస్కరణలు ఓ గేమ్ ఛేంజర్:చంద్రబాబు

ఏపీ శాసనసభలో జీఎస్టీ సంస్కరణలపై చర్చ... చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రం, దేశమే ముఖ్యం.. అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడి

Update: 2025-09-19 03:00 GMT

దే­శం­లో జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­లు ఓ గేమ్ ఛేం­జ­ర్ అని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు కొ­ని­యా­డా­రు. జీ­ఎ­స్టీ 2.0 సం­స్క­ర­ణ­ల­పై ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ అసెం­బ్లీ­లో చర్చ­లో చం­ద్ర­బా­బు పా­ల్గొ­న్నా­రు. గతం­లో రా­ష్ట్రా­లు కూడా రక­ర­కాల పన్ను­లు కట్టే­వ­న్న చం­ద్ర­బా­బు.. జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­ల­తో పే­ద­లు జీ­వి­తా­లు మా­ర­తా­య­ని చె­ప్పా­రు. ఆర్థిక వ్య­వ­స్థ­త­కు జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­లు ఊత­మి­స్తా­య­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. సం­స్క­ర­ణ­ల­కు తాను ముం­దుం­టా­న­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ‘‘జీ­ఎ­స్టీ రెం­డో­త­రం సం­స్క­ర­ణ­లు తీ­సు­కొ­చ్చా­రు.. సం­స్క­ర­ణ­ల­కు నేను ఎప్పు­డూ ముం­దుం­టా­ను. అభి­వృ­ద్ధి జరి­గి­తే సంపద సృ­ష్టి­తో ప్ర­భు­త్వా­ని­కి ఆదా­యం వస్తుం­ది. ప్ర­భు­త్వా­ని­కి ఆదా­యం వస్తే­నే సం­క్షే­మం, అభి­వృ­ద్ధి జరు­గు­తుం­ది. సంపద సృ­ష్టిం­చ­ని వా­రి­కి సం­క్షే­మం ఇచ్చే అధి­కా­రం లేదు. అప్పు­లు చేసి సం­క్షే­మం ఇవ్వ­డం సరి­కా­ద­నే­ది నా నమ్మ­కం. ఆర్థిక ఇబ్బం­దు­లు వచ్చి­నా.. దేశం, రా­ష్ట్ర­మే ము­ఖ్యం. దీ­ర్ఘ­కాల సం­స్క­ర­ణ­ల­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని చూ­డా­లి.” అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

అప్పులు చేసి సంక్షేమమా..?

అభి­వృ­ద్ధి­కి కృషి చే­స్తే అదే సంపద పెం­చు­తుం­ద­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. సంపద సృ­ష్టిం­చ­లే­ద­ని వ్య­క్తు­ల­కు సం­క్షే­మం ఇచ్చే అర్హత లే­ద­న్నా­రు. అప్పు­లు చేసి సం­క్షే­మం ఇవ్వ­డం సరి­కా­ద­న్నా­రు. ప్ర­ధా­ని మోడీ ఆధ్వ­ర్యం­లో చాలా సం­స్క­ర­ణ­లు జరు­గు­తు­న్నా­య­ని చె­ప్పా­రు. వన్ నే­ష­న్.. వన్ వి­జ­న్‌­తో అడు­గు­లు వే­శా­మ­న్నా­రు.

గతంలో ఇలా...

గతం­లో 5, 12, 18, 28 శాతం ఇలా 4 టైర్ పన్నుల వ్య­వ­స్థ ఉం­డే­ద­ని చం­ద్ర­బా­బు గు­ర్తు చే­శా­రు. ఒకే ఉత్ప­త్తి­కి సం­బం­ధిం­చి అను­బంధ ఉత్ప­త్తు­లు వస్తే పన్ను­లు మా­ర్చే­వా­ర­ని వె­ల్ల­డిం­చా­రు. "పన్నుల వి­ధా­నం­లో 2 శ్లా­బు­లు (5, 18శాతం) ఉంచి సర­ళ­త­రం చే­శా­రు. ఈసా­రి అన్ని పం­డు­గ­లు ఘనం­గా జరు­పు­కొ­నే అవ­కా­శం ఉంది. ప్ర­ధా­ని మోదీ సం­స్క­ర­ణ­ల­తో పరో­క్ష పన్ను చె­ల్లిం­పు­దా­రు­లు 132శాతం పె­రి­గా­రు.” అని చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. 2017లో 65లక్షల మంది ఉంటే.. ప్ర­స్తు­తం 1.51 కో­ట్ల మంది ఉన్నా­రు. జీ­ఎ­స్టీ రి­సి­ప్ట్‌ల ద్వా­రా 2018లో రూ.7.19లక్షల కో­ట్ల ఆదా­యం వస్తే.. ప్ర­స్తు­తం 22.08లక్షల కో­ట్ల ఆదా­యం వచ్చిం­ది. జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­లు పేదల జీ­వి­తా­ల­పై ప్ర­భా­వం చూ­పు­తా­యి. ‘వన్‌ నే­ష­న్‌- వన్‌ వి­జ­న్‌’ ని­నా­దం­తో ముం­దు­కె­ళ్లా­లి. డబు­ల్‌ ఇం­జి­న్‌ గ్రో­త్‌ సా­ధిం­చే దే­శం­గా భా­ర­త్‌ ఎదు­గు­తుం­ది. కొ­త్త పన్ను­ల­తో వి­ని­యో­గం పె­రి­గి ఆర్థిక వ్య­వ­స్థ­కు రూ.2లక్షల కో­ట్లు సమ­కూ­రు­తుం­ది’’ అని సీఎం వి­వ­రిం­చా­రు. వన్ నే­ష­న్.. వన్ వి­జ­న్‌­తో అడు­గు­లు వే­శా­మ­న్నా­రు. ఆర్ధిక ఇబ్బం­దు­లు ఉన్నా దేశం, రా­ష్ట్ర­మే తమకు ప్ర­ధా­న­మ­ని సీఎం చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ అభి­వృ­ద్ధి చేసి ప్ర­పంచ పటం­లో పె­ట్టా­ల­న్న­దే తన లక్ష్య­మ­ని ప్ర­క­టిం­చా­రు.

10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ శా­స­న­సభ సమా­వే­శా­లు ఈనెల 30వ తేదీ వరకు జర­గ­ను­న్నా­యి. 10 రో­జుల పాటు అసెం­బ్లీ సమా­వే­శా­లు ని­ర్వ­హిం­చా­ల­ని బీ­ఏ­సీ సమా­వే­శం­లో ని­ర్ణ­యిం­చా­రు. శా­స­న­సభ స్పీ­క­ర్ అయ్య­న్న పా­త్రు­డి అధ్య­క్ష­తన జరి­గిన శా­స­న­సభ వ్య­వ­హా­రాల సలహా కమి­టీ భే­టీ­లో ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు­తో పాటు మం­త్రు­లు నా­దెం­డ్ల మనో­హ­ర్, పయ్యా­వుల కే­శ­వ్, ఎమ్మె­ల్యే­లు జీవీ ఆం­జ­నే­యు­లు, వి­ష్ణు­కు­మా­ర్ రాజు హా­జ­ర­య్యా­రు. ఈ సం­ద­ర్భం­గా అసెం­బ్లీ సమా­వే­శాల ని­ర్వ­హ­ణ­పై తుది ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు.

Tags:    

Similar News