CBN: గిరిజనుల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి
అల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన... అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న సీఎం... కాఫీ మొక్కల పెంపకందారులతో చంద్రబాబు మాటమంతీ;
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో జరిగిన గిరిజన ఉత్సవాల్లో పాల్గొన్నారు. గిరిజన కుటుంబాలను సందర్శించి వారి జీవన పరిస్థితులను అర్థం చేసుకున్నారు. అరకు కాఫీ రైతులతో సమావేశమై, లగిసపల్లిలో బహిరంగ సభలో ప్రసంగించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.2,404 కోట్లతో రోడ్లు, రూ.2,373 కోట్లతో జల జీవన్ మిషన్, రూ.202 కోట్లతో అరకు కాఫీ విస్తరణ, రూ.50 కోట్లతో ఆసుపత్రుల నిర్మాణం వంటి పథకాలు ప్రారంభించారు.
ఏజెన్సీ దేవుడు సృష్టించిన అద్భుతం
ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుఅన్నారు. మళ్లీ జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు అల్లూరి జిల్లా లగిశపల్లిలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘‘ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన, అందమైన కొండలు దర్శనమిస్తాయి. మంచి మనసు ఉండే ప్రజలు ఇక్కడ ఉంటారు. ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై మొదట దృష్టి సారించింది ఎన్టీఆర్. గిరిజనుల సంక్షేమం గిరిజన ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏలో ఐఏఎస్‌లను నియమించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఏడు ఐటీడీఏలు సమర్థంగా పని చేయాలనే ఐఏఎస్‌లను ఉంచాం." అని చంద్రబాబు అన్నారు. ఆదివాసీ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. టూరిజం అభివృద్ధిపై తీసుకుంటున్న చర్యలు, ప్రాజెక్టుల వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మోదకొండమ్మ దర్శనం
వంజంగిలోని వనదేవత మోదకొండమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఇక, సమీపంలోని కాఫీ ప్లాంటేషన్లోని తోటలను పరిశీలించారు. కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ తోటల పెంపకంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. గిరిజన ఉత్పత్తులు, కాఫీ సాగు, మార్కెటింగ్, టూరిజం, హోం స్టే, హోం హట్స్ వంటి అంశాలకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలను చేసుకున్నారు. టూరిజం శాఖ, జీసీసీ, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డులతో వివిధ కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. " ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. అయితే, స్థానిక గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చేలా జీవో-3 తెచ్చాను.. జీవో-3 అమలు కాకుండా కాంగ్రెస్, వైసీపీ ఆపాయని చెప్పుకొచ్చారు. సంపదనున సృష్టించి పేదలకు పంచాలన్నదే నా లక్ష్యం.. సూపర్ సిక్స్ ను.. సూపర్ హిట్ చేశారు. ఎన్ని కష్టాలు వచ్చిన ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం.. గిరిజనులకు రూఫ్ టాప్ సోలర్ అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్
‘గిరిజనుల సంక్షేమంతో పాటు ఆ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో ఐఏఎస్ అధికారులను ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా నియమించి ఐటీడీఏలను బలోపేతం చేశామని.. రాష్ట్రంలో ఎస్టీలు 28.32 లక్షలు కాగా అందులో సుమారు 8.41 లక్షల గిరిజన కుటుంబాలు ఉన్నాయని... 3,77,051 మంది గిరిజనులకు ప్రతినెలా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తునట్లు తెలిపారు. పక్క రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో ఎంత పెన్షన్ ఇస్తున్నారో ఒకసారి గమనించాలన్నారు.. గిరిజనులకు పింఛన్ల కోసమే ఏడాదికి రూ.1,595 కోట్లు ఖర్చు చేస్తున్నాం... ఇదీ గిరిజనుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని వివరించారు. త్వరలోనే సోలార్ రూఫ్ టాప్ ఉచితంగా ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుడతాం’ అని సీఎం హామీ ఇచ్చారు.