CBN: నదులు అనుసంధానిస్తాం.. ప్రతీ ఎకరాకు నీళ్లిస్తాం

వైఎస్సార్‌ కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన.. అన్నదాతా సుఖీభవ రెండో విడత నిధులు విడుదల.. కడప గడ్డ మీద టీడీపీ సత్తా నిరూపించామన్న సీఎం

Update: 2025-11-20 02:30 GMT

ఎన్ని­క­ల్లో ఇచ్చిన హామీ మే­ర­కు సూ­ప­ర్ సి­క్స్ పథ­కా­న్ని సూ­ప­ర్ హిట్ చేసి చూ­పిం­చా­మ­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. ‘అన్న­దాత సు­ఖీ­భవ’ పథ­కం­లో భా­గం­గా కడప జి­ల్లా చి­న్న­దా­స­రి­ప­ల్లి­లో చం­ద్ర­బా­బు రెం­డో విడత ని­ధు­ల­ను వి­డు­దల చే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా సీఎం చం­ద్ర­బా­బు మా­ట్లా­డు­తూ.. పె­న్ష­న్ల పెం­పు, తల్లి­కి వం­ద­నం, మహి­ళ­ల­కు ఉచిత బస్సు ప్ర­యా­ణం, రై­తు­ల­కు అన్న­దాత సు­ఖీ­భవ ని­ధు­ల­ను వి­డు­దల చే­శా­మ­న్నా­రు. నాడు ఇచ్చిన హా­మీల అమలు సా­ధ్య­మా అని అం­ద­రూ అను­కు­న్నా­ర­ని.. కానీ సూ­ప­ర్ సి­క్స్ పథ­కా­న్ని దే­శం­లో ఎక్క­డా లేని వి­ధం­గా అమలు చేసి వి­జ­య­వం­తం­గా నె­ర­వే­ర్చా­మ­న్నా­రు. రై­త­న్న­కు ఏడా­ది­కి రూ.20 వేలు ఇస్తా­మ­ని చె­ప్పా­మ­ని, ఇప్ప­టి­కే మొ­ద­టి వి­డ­త­లో రై­తుల అకౌం­ట్ల­లో రూ.7 వేలు జమ చే­శా­మ­న్నా­రు. ఇవాళ అన్న­దాత సు­ఖీ­భవ రెం­డో విడత ని­ధు­లు కూడా జమ చే­శా­మ­ని తె­లి­పా­రు. 46.85 లక్షల మంది రై­తు­లు అన్న­దాత సు­ఖీ­భవ పథకం ద్వా­రా లబ్ధి పొం­దు­తు­న్నా­ర­ని పే­ర్కొ­న్నా­రు. "మహా­నా­డు ద్వా­రా కడప గడ్డ మీద తె­దే­పా సత్తా ఏంటో ని­రూ­పిం­చా­రు. ఎన్ని­కల ముం­దు సూ­ప­ర్‌ సి­క్స్‌ హా­మీ­లు ఇచ్చాం. హమీల అమలు సా­ధ్య­మే­నా అని ప్ర­శ్నిం­చా­రు. సూ­ప­ర్‌ సి­క్స్‌ హా­మీ­ల­ను సూ­ప­ర్‌ హి­ట్‌ చే­శాం. ఇప్ప­టి వరకు 46.85లక్షల మంది రై­తు­ల­కు రూ.14 వేల చొ­ప్పున జమ చే­శాం. గత ప్ర­భు­త్వ హయాం­లో ఆర్థిక వి­ధ్వం­సం జరి­గిం­ది. ఆర్థిక ఇబ్బం­దు­లు­న్నా రై­తుల ఖా­తా­ల్లో ని­ధు­లు జమ చే­స్తు­న్నాం. రై­తుల పట్ల మా ప్ర­భు­త్వా­ని­కి ఉండే చి­త్త­శు­ద్ధి­కి ఇదే ని­ద­ర్శ­నం." అని చం­ద్ర­బా­బు అన్నా­రు. రా­ష్ట్రం ఆర్థి­కం­గా ఇబ్బం­దు­ల్లో ఉన్నా.. ఇచ్చిన ప్ర­తీ హా­మీ­ని ఒక్కొ­క్క­టి­గా అమలు చే­స్తు­న్నా­మ­న్నా­రు.



సాగు మారాలి

సాగు తీరు మా­రా­లి.. వ్య­వ­సా­యం లా­భ­సా­టి కా­వా­లి. అన్న­దా­తల బతు­కు­లు మా­రా­లి. ప్ర­కృ­తి సే­ద్యం­లో ఎవరు ముం­దుం­టే.. వా­రి­దే భవి­ష్య­త్తు. రై­తుల అభి­వృ­ద్ధి కోసం పం­చ­సూ­త్రా­లు తీ­సు­కొ­చ్చాం. వా­టి­ని అమలు చే­స్తే.. రై­తుల సమ­స్య­ల­కు పరి­ష్కా­రం దొ­రు­కు­తుం­ది. నేనూ రైతు బి­డ్డ­నే.. మా నా­న్న­కు వ్య­వ­సా­యం­లో సహా­యం చే­సే­వా­డి­ని. పాత పద్ధ­తి­లో­నే వ్య­వ­సా­యం చే­స్తా­మం­టే.. రై­తు­కు ఇబ్బం­దు­లు వస్తా­యి. రై­తు­లు డి­మాం­డ్‌ ఆధా­రిత పం­ట­ల­ను సాగు చే­యా­లి. మనం పం­డిం­చిన పం­ట­ల­ను ఇతర దే­శా­ల­కూ ఎగు­మ­తి చే­యా­లి. అలా అయి­తే­నే రై­తు­ల­కు ఆదా­యం వస్తుం­ది. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­ను కరవు రహిత రా­ష్ట్రం­గా తీ­ర్చి ది­ద్దా­లి, ప్ర­తి ఎక­రా­కు నీ­ళ్లు ఇవ్వా­ల­నే­ది  నా సం­క­ల్పం. కృ­ష్ణా, గో­దా­వ­రి­తో పాటు అనేక నదు­లు ఉన్నా­యి. నదుల అను­సం­ధా­నం ద్వా­రా అన్ని రి­జ­ర్వా­య­ర్ల­లో నీ­ళ్లు నిం­ప­గ­లి­గి­తే.. ఒక ఏడా­ది వర్షం పడ­క­పో­యి­నా బ్యా­లె­న్స్‌ అవు­తుం­ది. అన్ని చె­రు­వు­లు నిం­పా­లి, భూ­గ­ర్భ జలా­లు పెం­చా­లి. భూ­మి­ని ఒక జలా­శ­యం­గా మా­ర్చా­లి. మనం పం­డిం­చిన పం­ట­ల­ను ఇతర దే­శా­ల­కూ ఎగు­మ­తి చే­యా­లి. అలా అయి­తే­నే రై­తు­ల­కు ఆదా­యం వస్తుం­ది. భవి­ష్య­త్తు­లో మూడో విడత రూ.6 వేలు కూడా రై­తుల అకౌం­ట్ల­లో వే­స్తా­మ­ని భరో­సా ఇచ్చా­రు.’’ అని సీఎం అన్నా­రు. కా­ర్య­క్ర­మం­లో వ్య­వ­సా­య­శాఖ మం­త్రి అచ్చె­న్నా­యు­డు తది­త­రు­లు పా­ల్గొ­న్నా­రు.

Tags:    

Similar News