Chalo Vijayawada: చలో విజయవాడ సక్సెస్‌ను జీర్ణించుకోలేకపోతున్న ఏపీ సర్కారు..
Chalo Vijayawada: చలో విజయవాడ సక్సెస్‌ను జీర్ణించుకోలేకపోతోంది ఏపీ సర్కారు.;
Chalo Vijayawada (tv5news.in)
Chalo Vijayawada: చలో విజయవాడ సక్సెస్‌ను జీర్ణించుకోలేకపోతోంది ఏపీ సర్కారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా.. పోలీసు ఉన్నతాధికారుల తీరును తప్పుబట్టినట్లు సమాచారం. క్షేత్రస్థాయి సిబ్బందిపై పోలీసు ఉన్నతాధికారులకు పట్టులేకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
చలో విజయవాడను అడ్డుకోవడంలో పూర్తి వైఫల్యం చెందడం ఆశ్చర్యం కలిగిస్తోందంటూ ఉన్నతాధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పోలీసుల సహకారం వల్లే చలో విజయవాడ సక్సెస్ అయిందంటూ ఆక్షేపించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆగ్రహం కారణంగా మనస్థాపానికి గురయ్యారు పోలీసు ఉన్నతాధికారులు.