ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. NTR భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. కొత్త పింఛన్ల ఎంపికకు నవంబర్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదే నెలలో పింఛన్ల తనిఖీ చేపడతారు. అనర్హులకు నోటీసులిచ్చి పింఛన్లు తొలగించేందుకు 45రోజుల సమయం తీసుకుంటారు. మొత్తంగా డిసెంబర్ నెలాఖరు నాటికి కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రస్తుత పింఛన్లలో అనర్హుల ఏరివేత పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది.